![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -65 లో..... మురళి నందుని ఒక్కటి చెయ్యాలని పెద్దావిడ ప్లాన్ చేసి గుడిలో వీళ్ళ చేత పూజ ఉందని అందరిని గుడికి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఒకరికొకరు చిటికెన వేలు పట్టుకోవాలని పెద్దావిడ చెప్తుంది. ఇష్టం లేకున్నా మురళి చెయ్ నందు పట్టుకుంటుంది.
ఆ తర్వాత నందు, మురళి గుడిలో గంట కొట్టండి అని పెద్దావిడ చెప్తుంది. మురళి ఒక్కడే వెళ్లి గంట కొడుతాడు. నందు కొట్టబోతుంటే తనకు అందదు. నందుని ఎత్తుకొని గంట కొట్టించమని పెద్దావిడ అంటుంది. అవసరం లేదని కిన్నెరని నందు ఎత్తుకొని గంట కొట్టిస్తుంది. వాళ్లతో పాటు సూర్య , తుఫాన్ కూడా ఉంటారు. ఆ తర్వాత అమ్మ జాను హుండీలో డబ్బు వెయ్ వేసేముందు గంట కొట్టాలని పెద్దావిడ చెప్తుంది జానూకి గంట అందదు.. బాస్ మీకు మంచి ఛాన్స్ వచ్చింది ఉపయోగించుకోండి అని సూర్య తో తుఫాన్ అంటాడు. జానుని నేను ఎత్తుకుంటానని సూర్య అంటాడు. వద్దని జాను అంటుంది. సూర్య రిక్వెస్ట్ చెయ్యగానే సరే నువ్వు కళ్ళు మూసుకోమని జాను అంటుంది.
దాంతో సూర్య కళ్ళు మూసుకోగనే పెద్దవిడని ముందు నిల్చొపెట్టి ఎత్తుకోమంటుంది జాను. పెద్దావిడని సూర్య ఎత్తుకుంటాడు. గంట కొడుతుంది. థాంక్స్ అబ్బాయి అని పెద్దావిడ అనగానే సూర్య షాక్ అవుతాడు. జాను నవ్వుకుంటుంది. ఆ తర్వాత హుండీలో డబ్బులు వేస్తూ జాను తన కోరికలు కోరుకుంటుంది. మరొకవైపు నందు, మురళి హోమం చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |